ఓ బేబీ..ఓ బేబీ..


Fri,December 14, 2018 11:51 PM

Samantha film titled O Baby

వినూత్నమైన ఇతివృత్తాలతో సినిమాలు చేస్తూ తెలుగు, తమిళ భాషల్లో వరుస విజయాల్ని సొంతం చేసుకుంటున్నది సమంత. ఆమె కథానాయికగా నందినిరెడ్డి దర్శకత్వంలో మహిళా ప్రధాన ఇతివృత్తంతో ఓ చిత్రం తెరకెక్కుతున్నది. కొరియన్ చిత్రం మిస్ గ్రానీ ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి ఓ బేబీ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు తెలిసింది. ఎంత సక్కగున్నావే పేరును ఉపశీర్షికగా నిర్ణయించినట్లు సమాచారం. అనూహ్య పరిణామాల కారణంగా యువతిగా మారిన ఓ వృద్ధురాలి కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతున్నది. ఇందులో 70 ఏళ్ల వృద్ధురాలిగా, 20 యువతిగా సమంత ద్విపాత్రాభినయం చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రయోగాత్మక పంథాలో ఆమె పాత్ర సాగనున్నట్లు సమాచారం. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, సురేష్‌ప్రొడక్షన్స్ సంస్థలతో కలిసి సునీత తాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు తెలిసింది. ఈ సినిమాతో పాటు తెలుగులో భర్త నాగచైతన్యతో మరో సినిమా చేస్తున్నది సమంత. కుటుంబ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రానికి శివనిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు.

2328

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles