రాజకీయ నాయకురాలిగా..

Sun,February 10, 2019 12:25 AM

నాగచైతన్యతో వివాహం జరిగిన తరువాత నుంచి సినిమాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నది సమంత. కమర్షియల్ చిత్రాలకు భిన్నంగా నటనకు ఆస్కారమున్న విభిన్నమైన కథలకే ప్రాధాన్యతనిస్తున్నది. రంగస్థలం నుంచి కొత్త తరహా చిత్రాల్లో మాత్రమే నటిస్తున్న సమంత తాజాగా మరో కొత్త తరహా పాత్రలో కనిపించడానికి సిద్ధమవుతున్నది. విలక్షణ చిత్రాల కథానాయకుడిగా పేరు తెచ్చుకున్న విజయ్ సేతుపతి నటిస్తున్న తాజా తమిళ చిత్రం తుగ్లక్ దర్బార్. డెల్హీ ప్రసాద్ దీన్‌దయాల్ దర్శకత్వం వహించనున్నాడు. సెవెన్ స్క్రీన్స్ స్టూడియోస్ పతాకంపై లలిత్‌కుమార్ నిర్మించనున్నారు. జూన్‌లో సెట్స్‌పైకి రానున్న ఈ చిత్రంలో సమంత కథానాయికగా నటించనుంది ఆమె ఇందులో రాజకీయ నాయకురాలిగా కనిపిస్తుందని చిత్ర బృందం చెబుతోంది. సమకాలీన రాజకీయాలపై వ్యంగ్యాస్త్రంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. సమంత ప్రస్తుతం తెలుగులో నాగచైతన్యతో కలిసి మజిలీతో నందినిరెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. తమిళంలో ఆమె నటిస్తున్న సూపర్ డీలక్స్ త్వరలోనే విడుదల కానుంది.

3584

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles