హృదయానికి దగ్గరైన పాత్ర!


Fri,March 15, 2019 11:32 PM

samantha akkineni oh baby movie shooting completed in record time pk

సమంత కథానాయికగా నందినిరెడ్డి దర్శకత్వంలో ఓ బేబీ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కొరియన్ సినిమా మిస్‌గ్రానీ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి.సురేష్‌బాబు నిర్మిస్తున్నారు. 70ఏళ్ల వృద్ధురాలు అనూహ్య పరిణామాల వల్ల 20ఏళ్ల యువతిగా మారడం అనే వైవిధ్యమైన ఇతివృత్తంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఈ విషయాన్ని సమంత ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. తన కెరీర్‌లోనే అత్యంత ఇష్టమైన పాత్ర ఇదని సమంత వ్యాఖ్యానించింది. నా జీవిత పథాన్ని నిర్ధేశించడంలో తోడ్పాటునందిస్తున్న ఈ విశ్వానికి, దేవుడికి, ఎందరో ఆత్మీయులకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను.

ఈ ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూశాను. కానీ ఈ రోజు నా ఉన్నతిలోని నిజమైన సంతృప్తిని ఆస్వాదిస్తున్నాను. నా సినీ ప్రయాణంలో ఎంతో ప్రత్యేకతమైన పాత్ర ఇదని హృదయం చెబుతున్నది. ఈ చిత్రంలో నన్ను ఎంపిక చేసుకున్నందుకు దర్శకురాలు నందినిరెడ్డికి కృతజ్ఞతలు అని సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించింది. ఈ సందర్భంగా ఓ బేబీ సినిమాలోని స్టిల్‌ను అభిమానులతో పంచుకున్నది. తెల్లటి వస్ర్తాల్లో తలపైకెత్తి చూస్తున్న సమంత ఫొటో నెటిజన్లలో ఆసక్తిని కలిగిస్తున్నది.

816

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles