భయం వదిలిపెట్టండి!


Sun,August 25, 2019 11:51 PM

Samantha Akkineni Fitness Stunt Goes Viral On Social Media

దక్షిణాదిన ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధాన్యతనిచ్చే కథానాయికల్లో సమంత ముందు వరుసలో ఉంటుంది. సినిమాలపరంగా ఎంత బిజీగా ఉన్నా వ్యాయామాన్ని మాత్రం అస్సలు నిర్లక్ష్యం చేయదు. శారీరకంగా పర్‌ఫెక్ట్‌గా ఉండటమే అన్ని రుగ్మతలకు విరుగుడు అని ఎప్పుడూ చెబుతుంటుంది ఈ చెన్నై సోయగం. సోషల్‌మీడియాలో తన ఫిట్‌నెస్ వీడియోలను తరచుగా పోస్ట్ చేస్తూ అభిమానుల్లో స్ఫూర్తిని నింపుతుంటుంది. ఇటీవలకాలంలో సోషల్‌మీడియాకు కాస్త దూరంగా ఉన్న సమంత తాజాగా పార్కర్ శైలి (మిలిటరీ శిక్షణలో ఉపయోగించే వ్యాయామాలు) ఫిట్‌నెస్ వీడియోతో ఇన్‌స్టాగ్రామ్‌లో అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నది. ఇనుప స్తంభంపైకి ఒడుపుగా ఎగబాకి..ఎంతో జాగ్రత్తగా క్రిందకు దిగుతున్న వీడియో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నది. కొత్త విషయాల్ని ప్రయత్నించడానికి ఎప్పుడూ భయపడకండి. మీ శక్తిసామర్థ్యాల్ని తెలుసుకొని మీరు ఆశ్చర్యానికిలోనవుతారు అంటూ ఆ వీడియోకు క్యాప్షన్‌ను జత చేసింది సమంత.

622

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles