ప్రేమికుల రోజున..

Tue,November 5, 2019 12:11 AM

శర్వానంద్, సమంత జంటగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతున్నది. తమిళ చిత్రం 96 ఆధారంగా హృద్యమైన ప్రేమకథతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్రేమికుల రోజు సందర్భంగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న విడుదలచేయబోతున్నట్లు తెలిసింది. విజయ్ సేతుపతి, త్రిష జంటగా తమిళంలో రూపొందిన 96 చిత్రం కమర్షియల్‌గా పెద్ద విజయాన్ని సాధించింది. కాలప్రవాహంలో విడిపోయిన ఓ జంట కొన్నేళ్ల తర్వాత కలుసుకొని తమ ప్రేమ జ్ఞాపకాల్ని ఎలా పునశ్చరణ చేసుకున్నారనే కథాంశంతో భావోద్వేగభరిత ప్రేమకథగా ఈ సినిమా తెరకెక్కింది. మాతృకకు దర్శకత్వం వహించిన ప్రేమ్‌కుమార్ తెలుగు రీమేక్‌కు నిర్దేశక బాధ్యతల్ని చేపట్టారు. 1996, 2019 సంవత్సరాల్లో ఈ కథ జరుగుతుంది. తెలుగు నేటివిటీకి అనుగుణంగా స్క్రిప్ట్‌లో మార్పులు చేశారు. త్రిష పోషించిన జాను పాత్రలో సమంత కనిపిస్తున్నది. సినిమా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల్ని జరుపుతున్నారు. త్వరలోనే తెలుగు వెర్షన్‌కు సంబంధించిన టైటిల్‌ను ప్రకటించే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్లు సమాచారం. దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

682

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles