డిటెక్టివ్ పాత్రలో సల్మాన్!

Thu,February 7, 2019 11:50 PM

ప్రస్తుతం సల్మాన్‌ఖాన్ భారత్ చిత్రంలో నటిస్తున్నారు. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకుడు. కత్రినాకైఫ్ కథానాయిక. దేశభక్తి ప్రధాన కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్ర టీజర్ ఇటీవలే విడుదలై అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఇదిలావుండగా ఈ సినిమా తర్వాత సల్మాన్‌ఖాన్ డిటెక్టివ్ పాత్రలో ఓ చిత్రాన్ని చేయబోతున్నట్లు తెలిసింది. దక్షిణ కొరియా చిత్రం వెటరన్ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. పోలీస్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలందుకుంది. బాలీవుడ్‌కు చెందిన ఓ అగ్ర నిర్మాణ సంస్థ హిందీ రీమేక్ హక్కుల్ని సొంతం చేసుకున్నట్లు తెలిసింది.

997

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles