సాహోలో అతిథిగా..


Fri,May 24, 2019 12:32 AM

Salman Khan to do a cameo in Prabhas Saaho

ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం సాహో. యాక్షన్ థ్రిల్లర్ ఇతివృత్తంతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సుజీత్ దర్శకుడు. దాదాపు 250 కోట్ల బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ అతిథి పాత్రలో నటించనున్నట్లు సమాచారం. కథాగమనంలోని ఓ కీలకమైన సమయంలో సల్మాన్ పాత్ర కనిపిస్తుందని చెబుతున్నారు. శ్రద్ధాకపూర్ కథానాయికగా నటిస్తున్నది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రం ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకురానుంది. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

2952

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles