అలియా నుంచి కియారా!


Fri,May 10, 2019 12:05 AM

Salman Khan suggested Kiara Advani change her name Heres why

చిత్రసీమలో సెంటిమెంట్స్‌కు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు. ముఖ్యంగా అరంగేట్రం చేసే సమయంలో కథానాయికలు తమ పేరు విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ కనబరుస్తారు. పరిశ్రమలోకి ప్రవేశించే ముందు కొందరు నాయికలు తమ కెరీర్ సవ్యంగా సాగాలనే అభిలాషతో పేరును మార్చుకుంటారు. ఆ కోవలోనే ఢిల్లీ భామ కియారా అద్వాణీ కూడా సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చే ముందు పేరు మార్చుకుందట. ఈ విషయాన్ని ఓ చాట్‌షోలో పాల్గొన్న సందర్భంగా వెల్లడించిందీ అమ్మడు. నా అసలు పేరు అలియా. ఇండస్ట్రీలోకి వచ్చే ముందు అదే పేరుతో కెరీర్‌లో కొనసాగాలనుకున్నా. అయితే ఓ సందర్భంలో సల్మాన్‌ఖాన్‌ని కలిసినప్పుడు ఆయన పేరు మార్చుకోమని సూచించారు. అలియా పేరుతో ఓ కథానాయిక పాపులర్ అయింది. నీకు అదే పేరుంటే ప్రేక్షకులు అయోమయానికి లోనవుతారు. కెరీర్‌పరంగా అది మంచిది కాదు. కాబట్టి అన్ని కలిసివచ్చేలా ఉత్తమమైన పేరును ఎంపిక చేసుకో అని సల్మాన్ సలహా ఇచ్చారు. దాంతో నా పేరును కియారాగా మార్చుకున్నాను అని చెప్పింది కియారా అద్వాణీ. భరత్ అనే నేను వినయ విధేయ రామ చిత్రాలతో తెలుగులో సుపరిచితురాలైన ఈ సుందరి ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీగా ఉంది. అర్జున్‌రెడ్డి హిందీ రీమేక్ కబీర్‌సింగ్‌లో కూడా కియారానే కథానాయిక. ఈ చిత్రం జూన్ 21న విడుదలకానుంది.

1073

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles