సైమాకు ముస్తాబు


Mon,July 22, 2019 12:02 AM

Saima Eighth Edition Awards Ceremony to be held in Qatar on August 15-16

సైమా ఎనిమిదవ ఎడిషన్ అవార్డుల వేడుకలు ఆగస్ట్ 15-16వ తేదీల్లో ఖతార్‌లో జరుగనున్నాయి. ఈ వేడుకల్లో తెలుగు చిత్రసీమ నుంచి ప్రముఖ దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన రంగస్థలం చిత్రం 12 నామినేషన్స్‌తో అగ్ర స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో మహానటి (తొమ్మిది నామినేషన్స్), గీతగోవిందం(ఎనిమిది నామినేషన్స్), అరవింద సమేత (6నామినేషన్స్) నిలిచాయి. సైమా వేడుకలకు సంబంధించి శనివారం హైదరాబాద్‌లో నిర్వాహకులు పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విష్ణు ఇందూరి మాట్లాడుతూ గత ఏడాదితో పోలిస్తే ఈ సారి సైమా అవార్డులు మరింత కన్నుల పండువగా జరుగనున్నాయి. సినిమాలతో పాటు లఘు చిత్రాల రూపకర్తల్లోని ప్రతిభను వెలికితీయడానికి షార్ట్ ఫిల్మ్ అవార్డులను ప్రవేశపెట్టాం అని తెలిపారు. ఈ సమావేశంలో కథానాయికలు శ్రియ, నిధి అగర్వాల్, రుహాని శర్మ, శాన్వి శ్రీ వాస్తవ, అస్మిత నర్వాల్ తమ అందాలతో ఆకట్టుకున్నారు.

1339

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles