ఉగాది పచ్చడి లాంటి సినిమా!


Mon,April 8, 2019 12:08 AM

sai teja starrer chitralahari movie trailer released

సాయితేజ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం చిత్రలహరి. కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. నివేదా పేతురాజ్, కల్యాణి ప్రియదర్శన్ కథానాయికలు. మైత్రీ మూవీమేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్, సి.వి.మోహన్ నిర్మిస్తున్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక శనివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా పాల్గొన్న దర్శకులు కొరటాల శివ బిగ్ టికెట్‌ని, సుకుమార్ థియేట్రికల్ ట్రైలర్‌ని విడుదల చేశారు. ఈ సందర్భంగా సాయితేజ్ మాట్లాడుతూ మైత్రీ మూవీస్ నాకు చాలా స్పెషల్. ఎందుకంటే ఆరు సినిమాల ఫ్లాప్ తరువాత నాతో సినిమా చేయడానికి ముందుకొచ్చారు. దర్శకుడు కిషోర్ రచయితగా వున్నప్పటి నుంచే తెలుసు. ఇద్దరం మంచి స్నేహితులం. తను దర్శకుడిగా మారిన తరువాత ఇద్దరం కలిసి పనిచేయడానికి ఇప్పటికి కుదిరింది. దేవిశ్రీతో కలిసి నేను పనిచేయాలని మా అమ్మ కోరిక. అది ఈ సినిమాతో నెరవేరింది.

ఈ చిత్రానికి తన సంగీతంతో దేవి సపొర్ట్‌గా నిలిచారు. సునీల్‌తో సినిమా చేయాలనుకునేవాడిని. ఈ సినిమాతో ఆ కోరిక కూడా తీరింది. వెన్నెల కిషోర్, పోసానిగారితో పనిచేశాను. ఎన్ని ఫ్లాపులొచ్చినా, హిట్స్ వచ్చినా నేను ఈ స్టేజ్‌పై వున్నానంటే కారణం మా మావయ్యలు. మెగా అభిమానులు. నన్ను తేజు బాబు అని పిలవొద్దు. తేజు అంటే చాలు. ఈ నెల 12న విడుదలవుతున్న సినిమాను పాటల తరహాలోనే హిట్ చేయాలని కోరుకుంటున్నాను అన్నారు. సుకుమార్ మాట్లాడుతూ కిషోర్ చాలా సెన్సిటివ్‌గా సినిమాలు తీస్తున్నాడు. ఉగాది పచ్చడి లాంటి సినిమా ఇది.

ఈ సినిమా కోసం సాయి తన బాడీ లాంగ్వేజ్‌ను మార్చుకుని చాలా కష్టపడ్డాడు. మంచి సన్నివేశం కుదిరినప్పుడు దేవీని మించిన సంగీత దర్శకుడు మనకు కనిపించడు. ఈ సినిమాకు మంచి పాటలు కుదిరాయి అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు కిషోర్ తిరుమల, కల్యాణి ప్రియదర్శన్, నివేదా పేతురాజ్, నిర్మాతలు నవీన్ యెర్నేని, రవిశంకర్, సి.వి.మోహన్, దేవిశ్రీప్రసాద్, సునీల్, వెంకీ కుడుముల, శివ నిర్వాణ, సాహూ గారపాటి తదితరులు పాల్గొన్నారు.

1050

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles