నక్సలైట్‌గా సాయిపల్లవి?


Sun,December 16, 2018 12:26 AM

sai pallavi to do naxalite role in venu udugula movie

చక్కటి రూపలావణ్యంతో సుకుమారిలా కనిపించే తమిళ సోయగం సాయిపల్లవి నక్సలైట్ వంటి శక్తివంతమైన పాత్రను పోషించడమేమిటని ఆశ్చర్యపోతున్నారా? ప్రస్తుతం మన కథానాయికలు పాత్రలపరంగా చేసున్న ప్రయోగాల్ని పరిశీలిస్తే ఇది నిజమని నమ్మక తప్పదు. సినిమా ఎంపికలో సాయిపల్లవి ఆచితూచి వ్యవహరిస్తుంది. తన పాత్రలో నవ్యత ఉంటేనే సినిమాల్ని అంగీకరిస్తుంది. తాజాగా ఈ సొగసరి నక్సలైట్ పాత్రను పోషించబోతున్నట్లు తెలుస్తున్నది. వివరాల్లోకి వెళితే..నీది నాది ఒకే కథ చిత్రం ద్వారా విమర్శకుల ప్రశంసలందుకున్నారు దర్శకుడు వేణు ఊడుగుల. ఆయన తదుపరి చిత్రంలో సాయిపల్లవి కథానాయికగా నటించబోతున్న విషయం తెలిసిందే. త్వరలో ఈ చిత్రం సెట్స్‌మీదకు వెళ్లనుంది. రానా కథానాయకుడు. ఇందులో సాయిపల్లవి నక్సలైట్ పాత్రలో కనిపిస్తుందని చెబుతున్నారు. రానా పోలీసాఫీసర్ పాత్రను పోషిస్తున్నారని తెలిసింది. భిన్న నేపథ్యాలు, సైద్ధాంతిక వైరుధ్యాలు ఉన్న ఈ ఇద్దరి మధ్య ప్రేమకథే ఈ సినిమాలోని ఆసక్తికరమైన అంశమని అంటున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పూర్వ నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

2095

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles