వయసు అడ్డంకి కాదు

Mon,November 11, 2019 12:09 AM

పాత్రలకు వయసు అడ్డంకిగా నిలుస్తుందనే మాటను తాను విశ్వసించనని చెబుతున్నది సాయిపల్లవి. . తొలి సినిమా ప్రేమమ్ నుంచి వయసుకు మించిన పరిణితితో కూడిన పాత్రల్ని ఎంచుకుంటూ ప్రతిభను చాటుకుంటున్నది ఈ సొగసరి. మెచ్యూర్డ్ పాత్రలతో ప్రేక్షకుల్ని మెప్పించడం ఛాలెంజింగ్‌గా ఉంటుందని చెబుతున్నది సాయిపల్లవి. ఆమె మాట్లాడుతూ చదువుకునే వయసులోనే ప్రేమమ్‌లో లెక్చరర్‌గా నటించాను. దియా చిత్రంలో అమ్మగా నటించాను. ప్రతి సినిమాలో నా నిజమైన వయసు కంటే పెద్ద పాత్రల్లోనే నటించాను. కథ, నా పాత్రల్లో ఎంతవరకు కొత్తదనం ఉంది, వాటికి నేను న్యాయం చేయగలనా లేదా అనే విషయాల గురించి మాత్రమే ఆలోచిస్తాను. అంతే కానీ ఆ పాత్ర నా వయసు మించినదా లేదా అని ఎప్పుడూ ఆలోచించను. వయసును అవరోధంగా ఎప్పుడూ భావించను. అలాంటి పాత్రల్లోనే నటనను ప్రదర్శించడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుందని నా నమ్మకం అని తెలిపింది. ప్రస్తుతం తెలుగులో విరాటపర్వం 1992 చిత్రంలో నటిస్తున్నది సాయిపల్లవి. ఇందులో నక్సలైట్ పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రానికి వేణు ఊడుగుల దర్శకుడు.

548

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles