చిత్రలహరి ప్రారంభం


Tue,October 16, 2018 02:02 AM

Sai Dharam Tej Chitralahari Movie Launched

సాయిధరమ్‌తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం చిత్రలహరి సోమవారం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. కిషోర్ తిరుమల దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్నది. కల్యాణి ప్రియదర్శన్ కథానాయిక. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు కొరటాల శివ క్లాప్‌నివ్వగా, సాయిధరమ్‌తేజ్ అమ్మగారు విజయ కెమెరా స్విఛాన్ చేశారు. నిర్మాతలు చిత్ర విశేషాలు తెలియజేస్తూ హృదయానికి హత్తుకునే ప్రేమకథా చిత్రమిది. సాయిధరమ్‌తేజ్‌ను సరికొత్త కోణంలో ఆవిష్కరిస్తుంది. నవంబర్ మొదటివారంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలో తెలియజేస్తాం అన్నారు. ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఇదని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని, సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఆర్ట్: ఎ.ఎస్.ప్రకాష్, ఎడిటర్: శ్రీకర్‌ప్రసాద్, లైన్ ప్రొడ్యూసర్: కె.వి.వి.బాలసుబ్రహ్మణ్యం, సహనిర్మాత: ఎం. ప్రవీణ్, నిర్మాతలు: నవీన్ ఏర్నేని, వై.రవిశంకర్, మోహన్ చెరుకూరి.

1762

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles