సాయిధరమ్‌తేజ్ భోగి?


Wed,June 5, 2019 12:07 AM

Sai Dharam Tej and Maruthi Movie Titled as BHOGI

వరుసగా ఆరు పరాజయాల తరువాత చిత్రలహరి విజయంతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు యువ హీరో సాయిధరమ్‌తేజ్. ఈ సినిమా అందించిన విజయంతో రెట్టించిన ఉత్సాహంతో వున్న ఆయన తన తదుపరి చిత్రానికి సిద్ధమవుతున్నారు. మారుతి దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్, యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. త్వరలో సెట్స్‌పైకి రానున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సాయిధరమ్‌తేజ్ ప్లేబాయ్‌గా కనిపించనున్న ఈ చిత్రానికి భోగి అనే టైటిల్‌ను చిత్ర బృందం పరిశీలిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్ని చిత్ర వర్గాలు త్వరలోనే వెల్లడించనున్నట్లు తెలిసింది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నారు.

1967

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles