ఆదివారం రమ్మను..ఖాళీగా ఉంటా!


Wed,March 13, 2019 11:54 PM

Sai dharam tej and kishore tirumala chitralahari teaser

ఆ యువకుడి పేరు విజయ్. జీవితంలో మాత్రం ఎలాంటి విజయాలు లేవని బాధపడిపోతుంటాడు. బాధపడకు బాబాయ్..నీకూ ఓ మంచి రోజొస్తుందని మిత్రుడు అనునయించబోతుంటే.. ఆ వచ్చేదేదో ఆదివారం పూట రమ్మని చెప్పు బాబాయ్.. ఇంటిదగ్గర ఖాళీగా ఉంటాను అని చురకలంటిస్తుంటాడు. విజయ్ తాలూకు ముచ్చట్లేమిటో తెలుసుకోవాలంటే చిత్రలహరి సినిమా చూడాల్సిందే అంటున్నారు కిషోర్ తిరుమల. ఆయన దర్శకత్వంలో సాయిధరమ్‌తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం చిత్రలహరి. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్నది. కల్యాణిప్రియదర్శన్, నివేదా పేతురాజ్ కథానాయికలు. ఏప్రిల్ 12న విడుదలకానుంది. ఈ చిత్ర ట్రైలర్‌ను బుధవారం విడుదల చేశారు. సినిమాలోని నాయకానాయికలు, హాస్యనటుడు సునీల్ పాత్రల పరిచయంతో ట్రైలర్ ఆద్యంతం వినోదప్రధానంగా సాగింది.

దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ఈ సినిమాకు కోరగానే వాయిస్ ఓవర్ ఇచ్చిన దర్శకుడు సుకుమార్‌గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్‌గా అందరిని అలరించే చిత్రమిది అన్నారు. దేవిశ్రీప్రసాద్ అద్భుతమైన సంగీతాన్నందించారు. నాలుగు పాటలు బాగా కుదిరాయి. నా కెరీర్‌లో మంచి చిత్రంగా నిలిచిపోతుంది అని సాయిధరమ్‌తేజ్ తెలిపారు. నిర్మాతలు మాట్లాడుతూ అందరికి కనెక్ట్ అయ్యే టైటిల్ ఇది. కథలో హాస్యంతో పాటు చక్కటి భావోద్వేగాలుంటాయి. ఏప్రిల్ మొదటివారంలో ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించబోతున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో నివేదా పేతురాజ్, సునీల్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని, సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఆర్ట్: ఎ.ఎస్.ప్రకాష్.

5677

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles