షూటర్ దాదీస్ కథ


Wed,April 17, 2019 12:13 AM

saand ki aankh first look released taapsee pannu bhumi pednekar shooter dadi revolver dadi

బాలీవుడ్‌లో బయోపిక్‌ల పరంపర కొనసాగుతున్నది. వివిధరంగాల్లో ప్రభావశీలురైన వ్యక్తుల జీవితకథలు వెండితెర దృశ్యమానమవుతున్నాయి. తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన మహిళా షార్ప్ షూటర్లు చంద్రో తోమర్, ప్రకాశీ తోమర్‌ల జీవిత కథ సినిమాగా రూపొందుతున్నది. వారిని అభిమానులు షూటర్ దాదీస్ అని పిలుచుకుంటారు. 80ఏళ్ల వయసున్న ఆ మహిళలిద్దరూ జాతీయస్థాయిలో వివిధ షూటింగ్ కాంపిటీషన్స్‌లో పాల్గొని ఎన్నో పతకాలను సొంతం చేసుకున్నారు. ఆ ఇద్దరి పాత్రల్లో తాప్సీ, భూమీ పెడ్నేకర్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి సాండ్ కీ ఆంఖ్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సందర్భంగా చిత్రఫస్ట్‌లుక్‌ను మంగళవారం విడుదల చేశారు. వృద్ధాప్యం శరీరానికే ..మనసుకు కాదు అనే క్యాప్షన్ ఉన్న పోస్టర్‌లో తాప్సీ, భూమీ పెడ్నేకర్ వృద్ధురాళ్ల గెటప్‌లో కనిపిస్తున్నారు. సినిమాలో ప్రకాశీ తోమర్ పాత్ర పోషిస్తున్న తాప్సీ ఆమె గురించి తెలుసుకోవడానికి ఎంతో పరిశోధన చేసింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రకాశీతోమర్ స్వస్థలం బాగ్‌పట్‌కు వెళ్లి కొద్ది రోజులు అక్కడే గడిపింది. ఆమె నుంచి వ్యక్తిగతంగా ఎన్నో విషయాల్ని సేకరించింది. ఇదిలావుండగా ఈ సినిమా చిత్రీకరణ మొత్తం బాగ్‌పట్‌లోని జరిపారు. తుషార్‌హీరానందాని ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అనురాగ్‌కశ్యప్ నిర్మిస్తున్నారు. ప్రకాష్‌ఝా, విక్కీ కడియన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దీపావళి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకులముందుకురానుంది.

677

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles