70 కోట్లతో ైక్లెమాక్స్


Thu,July 18, 2019 11:04 PM

saaho song psycho saiyaan teaser prabhas shraddha kapoor

ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న తాజాచిత్రం సాహో. అంతర్జాతీయ ప్రమాణాలతో ైస్టెలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు సుజీత్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. యు.వి క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్నది. దాదాపు డ్బ్భై కోట్ల వ్యయంతో ఇటీవలే ైక్లెమాక్స్ ఫైట్‌ను చిత్ర బృందం తెరకెక్కించినట్లు సమాచారం. ఎనిమిది నిమిషాల నిడివితో కూడిన ఈ యాక్షన్ ఎపిసోడ్‌ను అబుదాబిలో ఓ ఎడారి సెట్‌లో చిత్రీకరించినట్లు తెలిసింది. రష్ అవర్-3, హెల్‌బోయ్‌తో పాటు పలు హాలీవుడ్ సినిమాలకు యాక్షన్ కొరియోగ్రఫీని అందించిన పెంగ్‌ఝాంగ్ సారథ్యంలో దాదాపు వంద మందికి పైగా విదేశీ ఫైటర్లతో ప్రభాస్ తలపడే ఈ పోరాట ఘట్టం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని చెబుతున్నారు. గత నెలలో ఆస్ట్రియాలో ప్రభాస్, శ్రద్ధాకపూర్‌పై రెండు పాటల్ని చిత్రీకరించారు. ఆగస్ట్ 15న సినిమాను విడుదలచేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. అయితే అనివార్య కారణాల వల్ల విడుదల వాయిదా పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఇప్పటివరకు దర్శకనిర్మాతలు ఎటువంటి ప్రకటన చేయలేదు.

1003

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles