ప్రతి విమర్శకు సమాధానం ఇస్తాను!

Tue,December 3, 2019 11:49 PM

‘సంగీత దర్శకుల మధ్య పోటీ అనేది ప్రేక్షకుల దృష్టి నుంచే కనిపిస్తుంటుంది. వ్యక్తిగతంగా మేమంతా సఖ్యతగానే ఉంటాం. మా మధ్య ఎలాంటి పోటీ ఉండదు’ అని అన్నారు తమన్. ప్రస్తుతంతెలుగు చిత్రసీమలో అగ్ర సంగీతదర్శకుల్లో ఒకరిగా చెలామణీ అవుతున్నారాయన. ఆయన సంగీతాన్ని అందిస్తున్న తాజా చిత్రం ‘వెంకీమామ’. వెంక నాగచైతన్య హీరోలుగా నటిస్తున్నారు. ఈ నెల 13న విడుదలకానుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో తమన్ పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాలివి....


‘వెంకీమామ’ భావోద్వేగవూపధానంగా సాగుతుంది. ఎడిటింగ్ రూమ్‌లో సినిమా చూడగానే కన్నీళ్లువచ్చాయి. కుటుంబంలో ఎదురైన ఓ సమస్యను మామాఅల్లుళ్లు ఎలా పరిష్కరించారన్నది ఆకట్టుకుంటుంది. వెంక నాగచైతన్య పోటీపడి నటించారు. కథ, కథనాలపై అవగాహన పెంచుకోవడానికి దర్శకుడు బాబీని పూర్తిగా ఫాలో అయ్యాను. ఓ అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఈ చిత్రానికి పనిచేసినట్లు అనిపించింది. వెంక నాగచైతన్య తొలిసారి కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా ద్వారా వారికో పెద్ద విజయాన్ని అందించాలనే బాధ్యతతో పనిచేశాను. ఈ సినిమాలోని ‘ఎన్నాళ్లకో..’ అనే రెట్రో సాంగ్‌కు ఎలక్ట్రానిక్ వాయిద్యాలు లేకుండా లైవ్ మ్యూజిక్ ద్వారా స్వరాలను సమకూర్చాం. ఈ పాటతో పాటు టైటిల్ సాంగ్‌కు మంచి స్పందన లభిస్తున్నది.

ఏడాదిన్నర విరామం..

భిన్నమైన కథాంశాలతో కూడిన సినిమాలకు సంగీతాన్ని అందించే అవకాశం లభిస్తుండటం ఆనందంగా ఉంది. ‘సరైనోడు’ నుంచి ‘మహానుభావుడు’ వరకు కెరీర్‌లో వచ్చిన ఏడాదిన్నర విరామం సంగీత దర్శకుడిగా స్వీయవిశ్లేషణ చేసుకునే అవకాశం దొరికింది. ప్రశంసలతో పాటు విమర్శల్ని సమానంగానే స్వీకరిస్తుంటాను. మన పనిని తిట్టేవాళ్లు ఉన్నప్పుడే తప్పుల్ని సరిదిద్దుకునే అవకాశం దొరుకుతుంది. విమర్శించిన వారిని నా స్వరాలతో సంతృప్తిపరచడానికే ప్రయత్నిస్తాను. నాపై వచ్చిన ప్రతి విమర్శకు సమాధానం ఇస్తుంటాను. ప్రతి సినిమా కథను రెండుమూడుసార్లు వింటాను. అప్పుడే గేయరచయితలతో ఎలాంటి పాటలు రాయించాలి, నా స్వరాలతో ప్రేక్షకుల్ని ఎలా కనెక్ట్ చేయగలననే దానిపై అవగాహన ఉంటుంది.

నిత్యవిద్యార్థిగా..

అలనాటి సంగీతదర్శకులు, రచయితలు, గాయకుల్ని బాధపెట్టకూడదనే ఆలోచనతో రీమిక్స్ సాంగ్స్‌కు దూరంగా ఉంటున్నాను. ట్రెండ్, నంబర్‌గేమ్స్‌ను నేను ఫాలో అవ్వను. నిత్యవిద్యార్థిగా ఉండటమే ఇష్టం. ప్రతిరోజు కొత్త విషయాల్ని నేర్చుకుంటా. ప్రస్తుతం అల వైకుం డిస్కోరాజా, ప్రతిరోజూ పండగే సినిమాలకు సంగీతాన్ని అందిస్తున్నాను.

816

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles