హిప్పీ


Thu,September 20, 2018 11:37 PM

RX 100 Hero Karthikeya New Movie Hippi

ఆర్.ఎక్స్ 100 చిత్రంతో మంచి విజయాన్ని దక్కించుకున్నారు హీరో కార్తికేయ. ఈ సినిమా తర్వాత ఆయన కథానాయకుడిగా వి. క్రియేషన్స్, ఏషియన్ సినిమాస్ పతాకాలపై ఓ చిత్రం రూపొందనున్నది. కలైపులి.ఎస్. థాను నిర్మాత. టి.ఎన్. కృష్ణ దర్శకుడు. శుక్రవారం కార్తికేయ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ చిత్రానికి హిప్పీ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. దర్శకుడు మాట్లాడుతూ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఇది. ఆద్యంతం వినోదభరితంగా సాగుతుంది. సమకాలీన పరిస్థితులకు అద్దంపడుతూ సహజంగా ఉంటుంది. అక్టోబర్ నుంచి హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. గత చిత్రానికి భిన్నంగా కార్తికేయ ఇందులో కనిపిస్తారు. కథానుగుణంగా సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారు. త్వరలో వారిని ఎంపికచేస్తాం అని తెలిపారు. 1985 నుండి తమిళంలో ఎన్నో విజయవంతమైన చిత్రాల్ని నిర్మించామని, తెలుగులో స్ట్రెయిట్ సినిమా చేయాలనే మా ప్రయత్నం ఇన్నాళ్లకు నెరవేరనుందని కలైపులి ఎస్ థాను చెప్పారు. సమాజంలోని ప్రతి ఒక్కరి జీవితాల్లో కనిపించే సంఘటనలన్నీ ఈ సినిమాలో ఉంటాయని, ఆర్.ఎక్స్ 100 తర్వాత తన కెరీర్‌లో మరో పెద్ద సక్సెస్‌గా నిలుస్తుందనే నమ్మకముందని కార్తికేయ చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: ఆర్.డి. రాజశేఖర్, సంగీతం: నివాస్ కె ప్రసన్న, ఎడిటింగ్: ప్రవీణ్ కె.ఎల్, స్టంట్: దిలీప్ సుబ్బరాయన్.

1220

More News

VIRAL NEWS

Featured Articles