పోలీస్ పాత్రలో...


Thu,February 14, 2019 03:26 AM

RX 100 fame Payal Rajput will be seen as a cop in her next

ఆర్‌ఎక్స్ 100 సినిమాలో ప్రతినాయిక ఛాయలున్న పాత్రలో సహజ అభినయంతో ఆకట్టుకున్నది పాయల్‌రాజ్‌పుత్. కథానాయికగా తొలి అడుగులోనే వైవిధ్యతను చాటుకొని అందరి దృష్టిని ఆకర్షించింది. ఆర్‌ఎక్స్ 100 అనూహ్య విజయంతో తెలుగులో పలు అవకాశాలు ఆమెను వరిస్తున్నాయి. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ ఛాలెంజింగ్ రోల్స్‌కు ప్రాధాన్యతనివ్వాలని ఈ సొగసరి నిర్ణయించుకున్నట్లు తెలిసింది. తాజా సమాచారం ప్రకారం పాయల్‌రాజ్‌పుత్ పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో నటించనున్నట్లు సమాచారం. మహిళా ప్రధాన ఇతివృత్తంతో పరన్‌దీప్ అనే నూతన దర్శకుడు ఓ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో పాయల్ రాజ్‌పుత్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నట్లు చెబుతున్నారు. ఈ పాత్ర కోసం ప్రస్తుతం పాయల్‌రాజ్‌పుత్ ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వర్కవుట్స్‌తో పాటు డైట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిసింది. సవాళ్లతో కూడిన క్యారెక్టర్ కావడంతో గతంలో పోలీస్ పాత్రలతో వచ్చిన కథాంశాలకు భిన్నంగా నటించే ఆలోచనతో పాయల్ రాజ్‌పుత్ కకసరత్తులు చేస్తోందట. ప్రస్తుతం రవితేజ కథానాయకుడిగా వి.ఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో పాయల్ రాజ్‌పుత్ కథానాయికగా నటిస్తున్నది.

2010

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles