మానవీయ విలువలతో..


Tue,April 9, 2019 12:04 AM

Runam Movie Audio Success Meet Ready To Release

గోపీకృష్ణ, మహేంద్ర, శిల్ప, ప్రియ అగస్థియన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం రుణం. భీమినేని సురేష్, జి.రామకృష్ణారావు నిర్మాతలు. ఎస్.గుండ్రెడ్డి దర్శకుడు. ఈ నెల 12న ఈ చిత్రం విడుదలకానుంది. సోమవారం హైదరాబాద్‌లో చిత్రబృందం పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించింది. నిర్మాతలు మాట్లాడుతూ మానవీయ విలువల నేపథ్యంలో సాగే చిత్రమిది. ఓ వ్యక్తిని నమ్మి మోససోయిన ఇద్దరు స్నేహితులు అతడిపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నారన్నది ఆకట్టుకుంటుంది. వాణిజ్య హంగులతో పాటు అంతర్లీనంగా చక్కటి సందేశం మిళితమై ఉంటుంది అని తెలిపారు. కన్నడంలో ఐదు సినిమాలకు దర్శకత్వం వహించిన నాకు తెలుగులో ఇదే తొలి చిత్రం. మనస్పర్థలు, అపోహలతో తల్లిదండ్రులు, పిల్లలకు మధ్య దూరం ఎలా పెరుగుతుందనే పాయింట్‌తో వినూత్నంగా ఉంటుంది అని దర్శకుడు చెప్పారు. అశ్లీలతకు తావులేని మంచి సినిమా ఇదని, ప్రతి కుటుంబంలో జరిగే కథను స్ఫూర్తిగా తీసుకొని దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించారని నాయకానాయికలు చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రదీప్ పత్తికొండ, నారాయణ, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

762

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles