పెళ్లిచేసుకోమని చెబుతా!


Thu,August 22, 2019 11:57 PM

rumours-will-stop-only-when-anushka-or-i-get-married-says-prabhas

సాహో చిత్ర ప్రమోషన్‌లో బిజీగా ఉన్నారు ప్రభాస్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషలో ఈ నెల 30న విడుదలకానుంది. అయితే ప్రచార కార్యక్రమాల్లో ఎక్కడకు వెళ్లినా ప్రభాస్‌కు పెళ్లి గురించిన ప్రశ్నలే ఎదురవుతున్నాయి. ముఖ్యంగా అనుష్కతో మీరు డేటింగ్ చేస్తున్నారా? ఇద్దరు ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ మీడియా వారు ప్రశ్నిస్తున్నారు. అనుష్క తనకు మంచి స్నేహితురాలని ఎన్నోసార్లు చెప్పారు ప్రభాస్. అయినా అవే ప్రశ్నలు పునరావృతం కావడంతో ప్రభాస్ కాస్త కఠినంగానే స్పందించాడు ఈ పుకార్లకు ఫుల్‌స్టాప్ పెట్టాలంటే అనుష్క త్వరగా పెళ్లిపీటలెక్కాలి. లేదా నేనన్నా ఓ ఇంటివాడిని కావాలి. ఈసారి అనుష్కను కలిసినప్పుడు త్వరగా పెళ్లి చేసుకోమని చెబుతాను. అప్పుడే మా ఇద్దరి సంబంధం గురించి వస్తున్న గాసిప్స్‌కు తెరపడుతుంది అన్నారు. ఒకవేళ ఇద్దరం ప్రేమలో ఉంటే దానిని బయటకు చెప్పడానికి అభ్యంతరాలు ఏముంటాయని ప్రభాస్ ప్రశ్నించారు. ఇలాంటి పుకార్లు ఎలా పుడతాయో తెలియదు. ఇవన్నీ చూస్తుంటే మీరందరూ నాకు త్వరగా పెళ్లిచేయాలని ఫిక్సైపోయారేమో అని వ్యాఖ్యానించారు ప్రభాస్.

937

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles