వ్యసనాల పర్యవసానాలు


Sat,May 11, 2019 12:00 AM

Romantic criminals movie release on 17th of this month.

మనోజ్‌నందన్, వినోద, అవంతిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం రొమాంటిక్ క్రిమినల్స్. పి.సునీల్‌కుమార్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీలక్ష్మీ పిక్చర్స్, శ్రావ్య ఫిలింస్ పతాకాలపై యెక్కలి రవీంద్రబాబు, బి.బాపిరాజు నిర్మిస్తున్నారు. ఈ నెల 17న ఈ చిత్రం విడుదలకానుంది. దర్శకుడు మాట్లాడుతూ ఒక రొమాంటిక్ క్రైమ్ కథ ఒక క్రిమినల్ ప్రేమకథ చిత్రాలకు సీక్వెల్‌గా రూపొందుతున్న చిత్రమిది. సమాజంలో దిగజారుతున్న మానవ విలువలు, ఒంటరితనంతో మత్తు పదార్థాలకు బానిసలుగా మారుతున్న యువత, ఇంటర్‌నెట్ అశ్లీలతతో పాటు పలు అంశాల్ని ఆవిష్కరిస్తూ ఈ సినిమాను రూపొందిస్తున్నాం. వినోదంతో పాటు చక్కటి సందేశం మిళితమై ఉంటుంది.

సున్నితమైన అంశాల్ని బోల్డ్‌గా ఈ సినిమాలో చూపిస్తున్నాం. సెన్సార్ పూర్తయింది. ఎ సర్టిఫికెట్ లభించింది అని తెలిపారు. ముసుగులు వేసుకున్న ముగ్గురు అమ్మాయిల కథ ఇది. ఇంజినీరింగ్ కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. వ్యసనాల తాలూకు పర్యవసానాల్ని అర్థవంతంగా ఈ సినిమాలో చూపించారు దర్శకుడు అని నిర్మాతలు చెప్పారు. దివ్య, మౌనిక, ఎఫ్.ఎమ్.బాబాయ్, సముద్రం వెంకటేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా:ఎస్.వి.శివరామ్, సంగీతం: సుధాకర్ మారియో.

1424

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles