పెళ్ళి పీటలెక్కేందుకు రెడీ అయిన సుహాసిని


Sat,February 27, 2016 02:04 PM

suhasini ready to marry an tv artist

టాలీవుడ్‌లో మరో భామ మ్యారేజ్‌కు రెడీ అయింది. అటు వెండి తెర అభిమానులనే కాక ఇటు బుల్లి తెర ప్రేక్షకులను అలరిస్తున్న సుహాసిని నటుడు రాజాని వివాహం చేసుకునేందుకు సిద్ధమైంది. చంటిగాడు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తెలుగులోనే కాక తమిళం, కన్నడ భోజ్‌పురి చిత్రాలలోను నటించి మెప్పించింది

తాజాగా సుహాసిని, రాజాల ఎంగేజ్‌మెంట్‌ జరగగా, తమ నిశ్చితార్ధం ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు ఈ జంట . చంటి గాడు, అడ్డా , రఫ్‌ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు పొందిన సుహాసిని అష్టా చెమ్మా, అపరంజి, ఇద్దరు అమ్మాయిల వంటి సీరియల్స్‌తో ఫ్యామిలీ ప్రేక్షకులకు దగ్గరయింది. ఈమెకు కాబోయే భర్త రాజా కూడా పలు సీరియల్స్ లో లీడ్ రోల్స్ చేసి మెప్పించాడు. ఈ జంటను చూసిన వారందరు చూడముచ్చటగా ఉందని ప్రశంసిస్తుండగా త్వరలోనే వీరిరివురు పెళ్లి పీటలెక్కేందుకు రెడీ అయ్యారు.

5558

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles