రెండు జన్మల కథ!


Wed,February 13, 2019 11:41 PM

Rendu Janmala katha movie press meet

ఇదొక సోషియో ఫాంటసీ చిత్రం. శ్రీకృష్ణదేవరాయ కాలంలోని ఓ విగ్రహం నేపథ్యంలో ఆద్యంతం ఆసక్తికరమైన మలుపులతో సాగుతుంది. రెండు జన్మల నేపథ్యంలో సాగే సినిమా ఇది. సాక్షిచౌదరి పాత్రకు గత జన్మవెనకున్న రహస్యం ఏమిటి? అన్నదే ఇందులో ఆసక్తికరం అన్నారు ఇంద్ర. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం సువర్ణసుందరి. చరిత్ర భవిష్యత్తును వెంటాడుతుంది అని ఉపశీర్షిక. సూర్య ఎమ్.ఎస్.ఎన్ దర్శకుడు. జయప్రద, పూర్ణ, సాక్షిచౌదరి, రాజా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్ టీమ్ పిక్చర్స్ పతాకంపై ఎమ్.ఎల్.లక్ష్మి నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే నెల ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హీరో ఇంద్ర బుధవారం హైదరాబాద్‌లో పాత్రికేయులతో మాట్లాడుతూ మాది విజయవాడ. నిర్మాత దాసరి కిరణ్‌కుమార్‌కు సమీప బంధువుని. స్వర్గీయ చాట్ల శ్రీరాములుగారి దగ్గర నటనలో మెళకువలు నేర్చుకున్నాను. రామ్‌గోపాల్‌వర్మ రూపొందించిన వంగవీటి చిత్రంలో తొలిసారి నటించారు. ఇది నా రెండవ చిత్రం.

ఆ సినిమాలో నా నటన నచ్చడంతో దర్శకుడు సూర్య ఈ చిత్రంలో ప్రధాన పాత్ర ఇచ్చారు. ఇందులో సాక్షిచౌదరికి జంటగా కనిపిస్తాను. నా పాత్ర చాలా రొమాంటిక్‌గా వుంటుంది. అనుకున్నదానికన్నా సినిమా బడ్జెట్ పెరిగింది. సినిమాపై వున్న నమ్మకంలో నిర్మాత ఎక్కడా రాజీపడలేదు. సాయి కార్తీక్ నేపథ్య సంగీతం, విజువల్ ఎఫెక్ట్స్ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయి. నటుడిగా మంచి గుర్తింపును తెచ్చిపెడుతుందన్న నమ్మకముంది. ఈ సినిమా తరువాత రామసక్కని సీతలో నటిస్తున్నాను. ప్రస్తుతం చిత్రీకరణ దశలో వుంది అన్నారు.

1563

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles