భానుమతి వైఫ్‌ఆఫ్ దుర్యోధన


Wed,September 20, 2017 11:26 PM

Regina Cassandra As Bhanumathi In Kurukshetra Was Just A Rumour

regina
గత కొంతకాలంగా తెలుగు సినిమాలకు దూరంగా ఉంటున్నది రెజీనా. తమిళ, కన్నడ భాషలపై ప్రత్యేక శ్రద్ధచూపుతున్నది. దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత ఓ భారీ పౌరాణిక చిత్రంతో కన్నడ చిత్రసీమలో పునరాగమనం చేస్తున్నది ఈ సొగసరి. 2010లో సూర్యకాంతి అనే కన్నడ చిత్రంలో నటించింది రెజీనా. ఆ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో వరుసగా అవకాశాలు రావడంతో మళ్లీ ఆ భాషలో సినిమా చేయలేదు. సుదీర్ఘ విరామం తర్వాత కన్నడంలో మునిరత్న కురుక్షేత్ర చిత్రాన్ని అంగీకరించిందామె. మహాభారతంలోని ధుర్యోధనుడి పాత్ర నేపథ్యంలో దాదాపు వంద కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కుతున్నది. ఇందులో దుర్యోధనుడి భార్య భానుమతి పాత్రలో రెజీనా నటిస్తున్నది.

మహారాణిగా ఆమె పాత్ర శక్తివంతంగా సాగుతుందని సమాచారం. భిన్నమైన ఆహార్యంతో ఆమె ఈ సినిమాలో కనిపించబోతున్నట్లు తెలిసింది. జె.కె.భారవి కథను అందిస్తున్న ఈ చిత్రానికి నాగన్న దర్శకత్వం వహిస్తున్నారు. దర్శన్, అర్జున్, అంబరీష్, రవిచంద్రన్, ప్రగ్యాజైస్వాల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం తమిళంలో మూడు సినిమాల్లో నటిస్తున్నది రెజీనా.

637

More News

VIRAL NEWS

Featured Articles