ఏబీసీడీలో నాగబాబు


Sun,December 16, 2018 12:31 AM

real life uncle becomes reel life father for allu sirish abcd movie

అల్లు శిరీష్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ఏబీసీడీ. సంజీవ్‌రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. మధుర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మధుర శ్రీధర్‌రెడ్డి, బిగ్‌బెన్ సినిమాస్ పతాకంపై యష్ రంగినేని నిర్మిస్తున్నారు. రుక్సార్ థిల్లాన్ కథానాయిక. ఫిబ్రవరి 8న విడుదలకానుంది. మలయాళ సూపర్‌హిట్ చిత్రం ఆధారంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ తుదిదశలో ఉంది. ఈ సినిమాలో అల్లు శిరీష్ తండ్రి పాత్రలో నాగబాబు నటిస్తున్నారు. ఈ సందర్భంగా అల్లు శిరీష్ మాట్లాడుతూ నాగబాబుగారితో నాకిది రెండో చిత్రం. రియల్‌లైఫ్‌లో ఆయన నాకు అంకుల్..ఇప్పుడు రీల్‌లైఫ్‌లో తండ్రిగా నటిస్తున్నారు. ఈ కథ విన్నప్పుడే తండ్రి పాత్రలో నాగబాబుగారిని తప్పమరొకరిని ఊహించుకోలేకపోయాను. ఆయనతో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉంది. వినూత్న కాన్సెప్ట్‌తో రూపొందిస్తున్న ఈ చిత్రం అందరిని ఆకట్టుకుంటుంది అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: జుధాసాంధీ, సహనిర్మాత: ధీరజ్ మొగిలినేని, నిర్మాతలు: మధుర శ్రీధర్‌రెడ్డి, యష్ రంగినేని.

1431

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles