వలపు మల్లెలమాల


Mon,August 19, 2019 12:05 AM

rdx love releasing shortly

మల్లెల సౌరభం, సుకుమారి సోయగం జతకలిస్తే పరువం కొత్త హొయలు పోతుంది. చూపరుల హృదయాల్లో వలపు సునామీ రేపుతుంది. పక్కనున్న ఫొటోలో పంజాబీ అమ్మడు పాయల్‌రాజ్‌పుత్‌ను చూస్తే కుర్రకారు గుండెల్లో అచ్చంగా అవే భావాలు వ్యక్తమవుతాయి. ఆర్ ఎక్స్ 100 చిత్రం ద్వారా తెలుగు చిత్రసీమలో తెరంగేట్రం చేసిన ఈ సుందరి తొలి సినిమాలోనే యువతరాన్ని ఉర్రూతలూపింది. హాట్‌హాట్ అందాలతో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ సుందరి ఆర్‌డీఎక్స్ లవ్ చిత్రంలో నటిస్తున్నది. తేజస్ కథానాయకుడు. శంకర్‌భాను దర్శకుడు. సి.కల్యాణ్ నిర్మాత. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో పాయల్‌రాజ్‌పుత్ పాత్ర యువతరాన్ని అలరించేలా సాగుతుందని..అందం, అభినయం కలబోతగా మెప్పిస్తుందని చిత్ర బృందం చెబుతున్నది. త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

367

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles