రవితేజ కనకదుర్గ?


Fri,March 15, 2019 11:35 PM

raviteja new movie title as kanakadurga

హీరో రవితేజ సినిమాల ఎంపిక విషయంలో స్పీడు పెంచారు. ప్రస్తుతం వి.ఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న డిస్కోరాజా చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ దశలో వుంది. కాగా ఈ సినిమాతో పాటు రవితేజ తాజాగా మరో చిత్రాన్ని అంగీకరించినట్లు తెలిసింది. విజయ్ హీరోగా నటించిన తమిళ చిత్రం తేరి. తెలుగులో పోలీసోడు పేరుతో విడుదలైన ఈ చిత్రాన్ని రీమేక్ చేయబోతున్నారు. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని మైత్రీమూవీమేకర్స్ నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఈ చిత్రానికి కనకదుర్గ అనే టైటిల్‌ని చిత్ర బృందం ఖరారు చేసినట్లు తెలిసింది. రవితేజ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటించనున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి రానుంది. ఓ పాప ప్రధానంగా సాగే ఈ సినిమాకు కనకదుర్గ టైటిల్ బాగుంటుందని చిత్ర వర్గాలు భావిస్తున్నాయని తెలిసింది.

1758

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles