ఉగాదికి ఫస్ట్‌లుక్


Tue,March 13, 2018 11:57 PM

Ravi_Teja.jpg
రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ నెల 18న విడుదల చేయబోతున్నారు. ఎస్.ఆర్.టి ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ రూపొందిస్తున్న ఈ చిత్రానికి కళ్యాణ్‌కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. రామ్ తాళ్లూరి నిర్మాత. మాళవికశర్మ కథానాయికగా నటిస్తున్నది. యాక్షన్, వినోదం, సెంటిమెంట్ అంశాలు మేళవించిన కుటుంబ కథా చిత్రమిది. రవితేజ పాత్ర చిత్రణ నవ్యపంథాలో వుంటుంది. 60శాతం చిత్రీకరణ పూర్తయింది. మే నెలాఖరున విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నాం అని చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ముఖేష్, సంగీతం: శక్తికాంత్ కార్తీక్, ఆర్ట్: బ్రహ్మ కడలి.

940

More News

VIRAL NEWS