తెలుగులో రీఎంట్రీ


Sun,June 2, 2019 11:55 PM

ravi teja shruti haasan team up once again for balupu directors next

దాదాపు రెండేళ్లుగా తెలుగు చిత్రసీమకు దూరంగా ఉంటున్నది తమిళ సోయగం శృతిహాసన్. కాటమరాయుడు తర్వాత ఆమె మరే తెలుగు చిత్రంలోనూ నటించలేదు. లండన్‌కు చెందిన థియేటర్ ఆర్టిస్టు మైఖేల్ కోర్సెల్‌తో ప్రేమాయణం కారణంగా ఈ సొగసరి సినిమాలకు విరామాన్ని ప్రకటించింది. ఇటీవలే ఈ జంట విడిపోయారు. అనుకోని మనస్పర్థల వల్ల తాను శృతిహాసన్ ప్రేమకు వీడ్కోలు చెప్పానని సోషల్‌మీడియా ద్వారా ప్రకటించాడు మైఖేల్ కోర్సెల్. విఫల ప్రేమబంధం నుంచి తేరుకుంటున్న శృతిహాసస్ ఇక సినిమాలపై దృష్టిపెట్టాలని నిర్ణయించుకుందట. రవితేజ సరసన ఈ అమ్మడు ఓ చిత్రంలో నటించబోతున్నదని వార్తలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..గతంలో రవితేజతో డాన్‌శీను బలుపు చిత్రాల్ని రూపొందించారు దర్శకుడు గోపీచంద్ మలినేని. వీరిద్దరి కలయిలో మరో చిత్రం తెరకెక్కనుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పూర్వ నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో శృతిహాసన్‌ను కథానాయికగా ఖరారు చేశారని తెలిసింది. సెప్టెంబర్‌లో ఈ సినిమా సెట్స్‌మీదకు వెళ్లనుంది.

2440

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles