పాతబస్తీలో డిస్కోరాజా


Sat,June 15, 2019 11:42 PM

ravi teja in hyderabad old city for disco raja

రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం డిస్కోరాజా. వి.ఐ.ఆనంద్ దర్శకుడు. ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. పాయల్‌రాజ్‌పుత్, నభానటేష్ కథానాయికలు. చిత్రీకరణ జరుగుతున్నది. త్వరలో హైదరాబాద్‌లో భారీ సెట్‌లో మేజర్ షెడ్యూల్‌ని ప్రారంభించబోతున్నారు. నిర్మాత చిత్ర విశేషాలు తెలియజేస్తూ ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన షెడ్యూల్‌లో రవితేజ, వెన్నెల కిషోర్‌ల మధ్య వచ్చే కీలక సన్నివేశాలను తెరకెక్కించాం. ప్రధాన తారాగణం పాల్గొనగా హైదరాబాద్ పాతబస్తీలో ముఖ్య ఘట్టాల్ని చిత్రీకరించాం. ఇందులో రవితేజ పాత్ర చిత్రణ కొత్త పంథాలో ఉంటుంది. అన్ని రకాల వాణిజ్య హంగులతో ఆకట్టుకుంటుంది అన్నారు. బాబీసింహా, వెన్నెల కిషోర్, సత్య, సునీల్, రామ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని, సంభాషణలు: అబ్బూరి రవి, సంగీతం: తమన్, దర్శకత్వం: వి.ఐ.ఆనంద్.

1604

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles