ఆధునిక పోలీస్ కథ


Fri,January 19, 2018 10:58 PM

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ నేరాల్ని పరిష్కరించే టెక్నో పోలీస్ కథతో తెరకెక్కిన చిత్రమిది అని అన్నారు విక్రమ్ సిరికొండ. ఆయన దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రం టచ్ చేసి చూడు. రవితేజ, రాశీఖన్నా, సీరత్‌కపూర్ నాయకానాయికలుగా నటించారు. నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి), వల్లభనేని వంశీ నిర్మాతలు. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానున్నది. శుక్రవారం హైదరాబాద్‌లో విక్రమ్ సిరికొండ పాత్రికేయులతో పంచుకున్న విశేషాలివి..
vikram-sirikonda
ఇద్దరు వ్యక్తుల మధ్య మనస్పర్థలు వస్తే గొడవకు దారి తిస్తుంది. అదే రెండు దేశాల మధ్య విభేదాల వస్తే యుద్ధానికి దారితీస్తుంది. సమతుల్యత అనేది జీవితానికి చాలా ముఖ్యం. నిజాయితీపరుడైన పోలీస్ అధికారి వ్యక్తిగత జీవితాన్ని, వృత్తిని బ్యాలెన్స్ చేసుకుంటూ తనకు ఎదురైన సవాళ్లను ఎలా అధిగమించాడు? ఈ క్రమంలో అతడికి ఎదురైన సంఘర్షణ నేపథ్యంలో సాగే చిత్రమిది. కుటుంబమే సర్వస్వంగా బ్రతికే వ్యక్తిగా, పోలీస్ అధికారిగా రవితేజ పాత్ర చిత్రణ భిన్న పార్శాల్లో సాగుతుంది. రెండు భిన్న కాలాలు, నేపథ్యాలతో ముడిపడిన కథ ఇది. పోలీసుల్లో స్ఫూర్తిని నింపేలా ఈ సినిమా ఉంటుంది.

ఫిబ్రవరిలో...

నృత్యాల్లో శిక్షణ ఇచ్చే యువతిగా రాశీఖన్నా, హీరో చిన్న నాటి స్నేహితురాలిగా సీరత్‌కపూర్ కనిపిస్తారు. రెగ్యులర్ సినిమాల్లో మాదిరిగా కాకుండా కథానాయికల పాత్రలకు సినిమాలో హీరో పాత్రతో సమానంగా ప్రాధాన్యత ఉంటుంది. ఫిబ్రవరి ప్రథమార్థంలో సినిమాను విడుదలచేయడానికి సన్నాహాలు చేస్తున్నాం.

అనుకోకుండా రచయితగా

ఠాగూర్ సినిమాతో సహాయ దర్శకుడిగా నా కెరీర్ మొదలైంది. వినాయక్ వద్ద పలు సినిమాలకు పనిచేశాను. దర్శకుడు డాలీ నాకు మంచి స్నేహితుడు. అతడు దర్శకత్వం వహించిన కొంచెం ఇష్టం కొంచెం కష్టంతో అనుకోకుండా రచయితగా మారాను. ఈ సినిమా నాకు మంచి పేరును తెచ్చిపెట్టింది. మిరపకాయ్, రేసుగుర్రం సినిమాలకు రచయితగా పనిచేశాను. వక్కంతం వంశీ చెప్పిన కథకు నా శైలి హంగులు జోడించి ఈ సినిమాను తెరకెక్కించాను. కమర్షియల్ హంగులతో పాటు యాక్షన్, ఫ్యామిలీ, రొమాన్స్ వినోదం అంశాల సమాహారంగా సాగుతుంది.

734

More News

VIRAL NEWS