కార్తి కొత్త చిత్రం


Wed,March 13, 2019 11:21 PM

Rashmika Mandanna Tamil debut with Karthi officially launched on March 13

కార్తి కథానాయకుడిగా నటిస్తున్న తాజా తమిళ చిత్రం బుధవారం చెన్నైలో ప్రారంభమైంది. రష్మిక మందన్న కథానాయిక. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్.ఆర్.ప్రకాష్‌బాబు, ఎస్.ఆర్.ప్రభు నిర్మిస్తున్నారు. భాగ్యరాజ్ కన్నన్ దర్శకుడు. విభిన్న కథాంశంతో రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సత్యన్‌సూర్యన్, సంగీతం: వివేక్ మెర్విన్, ఎడిటింగ్: ఆంటోని. ఛలో గీత గోవిందం చిత్రాలతో తెలుగు పరిశ్రమలో స్టార్‌డమ్ సంపాదించుకున్న రష్మిక మందన్న ఈ చిత్రం ద్వారా తమిళ చిత్రసీమలోకి అరంగేట్రం చేస్తుండటం విశేషం.

768

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles