గ్లామర్ పాత్రలకు దూరం

Mon,November 4, 2019 12:09 AM

బాహ్య రూపం కంటే అంతఃసౌందర్యానికే తాను విలువనిస్తానని చెబుతున్నది రష్మికమందన్న. ఆత్మసౌందర్యమే మన వ్యక్తిత్వాన్ని ప్రపంచానికి చాటిచెబుతుందని అంటోంది. అందాల ప్రదర్శనకు దూరంగా ఉంటున్న ఈ కన్నడ సొగసరి అభినయానికి ఆస్కారమున్న పాత్రల్ని ఎంచుకుంటూ సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నది. బోల్డ్ కథాంశాలతో చాలా మంది దర్శకనిర్మాతలు తనను సంప్రదించారని కానీ అలాంటి పాత్రలు చేయకూడదనే ఆలోచనతో వాటిని తిరస్కరించానని తెలిపింది. రష్మిక మందన్న మాట్లాడుతూ నేను గ్లామరస్ హీరోయిన్‌ను కాదు. అలాంటి పాత్రల్లో నన్ను ప్రేక్షకులు స్వీకరించలేరని అనుకుంటున్నాను. గ్లామర్ పాత్రలు చేయడానికి చాలా మంది కథానాయికలు ఉన్నారు. వారి బాటలో నేను అడుగులు వేయడంలో ఉపయోగమేమివుండదు. హీరోయిన్ అనగానే గ్లామర్ పాత్రలు మాత్రమే చేయాలని అనుకోవడం అర్థం లేదు. నటనతో రాణించవొచ్చని చాలా మంది నిరూపించారు. అందాల ప్రదర్శనతో సంబంధం లేకుండా నా శైలికి సరిపోయే సినిమాల్నే అంగీకరిస్తాను అని తెలిపింది. ప్రస్తుతం తెలుగులో సరిలేరు నీకెవ్వరు, భీష్మ చిత్రం నటిస్తున్నది రష్మిక మందన్న.

493

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles