నీ నీలి కన్నుల్లోని ఆకాశమే..


Tue,April 9, 2019 11:19 PM

rashmika mandanna first look in dear comrade released

కర్ణాటకలోని కూర్గ్ రమణీయమైన ప్రకృతి సౌందర్యానికి నెలవు. భూతల స్వర్గంలా భాసిల్లే ఆ నేల అందాలన్నింటిని తనలో అలంకరించుకున్నట్లు కనిపిస్తుంది కన్నడ సోయగం రష్మిక మందన్న. ఈ అందాలభామకు యువతరంలో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఛలో గీత గోవిందం చిత్రాలతో తెలుగులో అగ్రనాయికల సరసన చేరింది. ఈ అమ్మడు విజయ్‌దేవరకొండతో కలిసి నటిస్తున్న తాజా చిత్రం డియర్ కామ్రేడ్. భరత్‌కమ్మ దర్శకుడు. మైత్రీ మూవీమేకర్స్, బిగ్‌బెన్ సినిమాస్ సంస్థలు నిర్మిస్తున్నాయి. మే 31న ప్రేక్షకులముందుకురానుంది. ఈ చిత్రంలోని తొలి గీతాన్ని ఇటీవల విడుదల చేశారు. నీ నీలికన్నుల్లోని ఆకాశమే తెల్లారి అల్లేసింది నన్నే..నీ కాలి అందెల్లోని సంగీతమే సోకి..నీ వైపే లాగేస్తుంది నన్నే అంటూ అర్థవంతమైన సాహిత్యంతో ప్రణయభావనలకు అద్దంపడుతూ ఈ పాట సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.

జస్టిన్ ప్రభాకరన్ స్వరపరచిన ఈ గీతాన్ని గౌతమ్‌భరద్వాజ్ ఆలపించారు. ఈ చిత్రంలో విజయ్‌దేవరకొండ వైద్య విద్యార్థిగా, రష్మిక మందన్న లిల్లీ అనే మహిళా క్రికెటర్ పాత్రలో కనిపించనుంది. రష్మిక మందన్న జన్మదినాన్ని పురస్కరించుకొని ఇటీవలే విడుదల చేసిన ఆమె ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన లభించింది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సుజిత్‌సారంగ్, ఆర్ట్: రామాంజనేయులు, మాటలు: జె.కృష్ణ, నిర్మాతలు: నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి, మోహన్ చెరుకూరి, యష్ రంగినేని, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: భరత్ కమ్మ.

1088

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles