ఆ హద్దులు చెరిగిపోతున్నాయి!

Sun,March 10, 2019 11:46 PM

భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేసుకోవడం తనకు నచ్చదని చెబుతున్నది రాశీఖన్నా. వర్తమానంలోనే జీవిస్తూ దొరికిన ప్రతి క్షణాన్ని ఆనందమయం చేసుకోవాలన్నదే తన సిద్ధాంతమని అంటోంది. కమర్షియల్ కథాంశాలతో పాటు ప్రయోగాలకు ప్రాధాన్యతనిస్తూ తెలుగుతో పాటు తమిళంలో సినిమాలు చేస్తూ వైవిధ్యతను చాటుకుంటున్నది ఈ ఢిల్లీ సొగసరి. కథానాయికల కెరీర్ ఐదేళ్లు, పదేళ్లకు మించి ఉండదనే ధోరణిలో మార్పులు వస్తున్నాయని చెబుతున్నది రాశీఖన్నా. ఆమె మాట్లాడుతూ పదేళ్లు దాటిన కూడా ఇంకా సినిమాల్లో కొనసాగుతున్న హీరోయిన్‌లు చాలా మంది ఉన్నారు. గ్లామర్, పాటల కోసమే హీరోయిన్లు అనే హద్దులు చెరిగిపోతున్నాయి. వారి కోసం దర్శకనిర్మాతలు మంచి పాత్రలు సృష్టిస్తున్నారు.దక్షిణాది చిత్రసీమలో ఈ మార్పు కనబడుతున్నది. భవిష్యత్తు గురించి ఆలోచించకుండా విభిన్నమైన కథాంశాల్లో భాగం కావడానికి ఈ మార్పు స్ఫూర్తినిస్తుంది అని తెలిపింది. అలాగే నాకు ఓపిక ఎక్కువ.


తొందరపడి సినిమాలు చేయడం నచ్చదు. నిదానమే ప్రధానమని నమ్ముతాను. మంచి పాత్రలు దొరికేవరకూ వేచిచూస్తాను. అదే నాకు సక్సెస్‌లను తెచ్చిపెడుతుంది. మంచి పాత్రలతో పాటు పారితోషికానికి నేను ప్రాముఖ్యతనిస్తాను డబ్బు గురించి ఆలోచించడం అవసరమే. మంచి పాత్ర అనిపిస్తే పారితోషికం తగ్గించి సినిమాలు చేస్తాను. కానీ అలాంటి స్ఫూర్తివంతమైన పాత్రలు కెరీర్‌లో ఇప్పటివరకూ ఎదురవలేదు అని తెలిపింది.

2628
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles