హరియాణ హరికేన్


Sat,July 6, 2019 11:59 PM

ranveer singh birthday film first look out as haryana hurricane kapil dev

కపిల్‌దేవ్ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు 1983లో తొలిసారిగా ప్రపంచకప్‌ను గెలుచుకొని విశ్వవిజేతగా ఆవిర్భవించిన విషయం తెలిసిందే. ఆ అపురూప ఘట్టానికి వెండితెర దృశ్యరూపంగా తెరకెక్కిస్తున్న చిత్రం 83. కబీర్‌సింగ్ దర్శకుడు. విష్ణు వర్థన్ ఇందూరి, మధు మంతెన, కబీర్‌ఖాన్, సాజిద్ నదియావాలా, దీపికా పదుకోన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కపిల్‌దేవ్ పాత్రలో రణ్‌వీర్‌సింగ్ నటిస్తున్నారు. ఈ రోజు ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా ఈ చిత్రంలోని తన లుక్‌ను అభిమానులతో పంచుకున్నారు రణవీర్‌సింగ్. నాకు ఎంతో ప్రత్యేకమైన ఈ రోజున హరియాణ హరికేన్ కపిల్‌దేవ్‌ను పరిచయం చేస్తున్నా అని రణ్‌వీర్‌సింగ్ ఆ ఫొటోకి క్యాప్షన్ ఇచ్చారు.

వైట్ జెర్సీ ధరించి మెడలో నల్లని దారం ధరించి, బాల్‌ని ఎగరేస్తున్న రణవీర్ లుక్ అందరిని ఆకట్టుకుంటోంది. కొన్ని గంటల్లోనే ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లక్షల్లో లైకులు వచ్చాయి. ఈ ఫొటోపై టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్ స్పందిస్తూ అచ్చం పాజీ( కపిల్‌దేవ్)లాగే వున్నావ్ హ్యాపీ బర్త్‌డే బ్రో అని ట్వీట్ చేశారు. బాలీవుడ్‌కు చెందిన పలువురు నటీనటులు కూడా రణ్‌వీర్ లుక్‌కు ఫిదా అయ్యారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 10న విడుదల చేయాలని చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.

893

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles