సరికొత్త ప్రేమకథ!


Sun,September 23, 2018 11:25 PM

Rana launches teaser of Anaganaga O Prema Katha

విరాజ్ జె అశ్విన్, రిద్దికుమార్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం అనగనగ ఓ ప్రేమకథ. ప్రతాప్ తాతంశెట్టి దర్శకుడు. ప్రముఖ నిర్మాత డీవీఎస్ రాజు అల్లుడు కేఎల్‌ఎన్ రాజు థౌజెండ్ లైట్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ను హీరో రానా శనివారం ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ సరికొత్త కథాంశంతో రూపొందుతున్న ప్రేమకథా చిత్రమిది. ప్రతిభను, కొత్తదనాన్ని ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుండే హీరో రానా మా చిత్ర టీజర్‌ను విడుదల చేయడం ఆనందంగా వుంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాలన్నీ ఈ చిత్రంలో వున్నాయి అన్నారు. నిర్మాత మాట్లాడుతూ మా సంస్థ నిర్మిస్తున్న తొలి చిత్రమిది.అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. కాశీవిశ్వనాథ్, అనీష్ కురువిళ్ల, వేణు తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: కె.సి.అంజన్, పాటలు: శ్రీమణి, కెమెరా: ఎదురోలు రాజు, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: ప్రతాప్ తాతంశెట్టి.

1465

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles