సమాజం కోసం..


Mon,July 8, 2019 12:02 AM

Rana Daggubati releases the teaser of Suriya starrer Bandobast

సూర్య కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం బందోబస్త్. మలయాళ అగ్ర నటుడు మోహన్‌లాల్ కీలక పాత్రను పోషిస్తున్నారు. కె.వి.ఆనంద్ (రంగం ఫేమ్) దర్శకుడు. సుభాస్కరణ్ నిర్మాత. ఈ చిత్ర టీజర్‌ను రానా శనివారం ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. భారత్, పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, రైతులు, నదీ జలాల సమస్యల్ని చర్చిస్తూ రూపొందిస్తున్న చిత్రమిది. ఇందులో సూర్య కమాండోగా, ముస్లిమ్ వ్యక్తి కథిర్‌గా, సుభాష్‌గా విభిన్న గెటప్స్‌లో కనిపించనున్నారు. టీజర్‌కు అద్భుతమైన స్పందన లభిస్తున్నది. సామాజికాంశాల్ని స్పృశిస్తూ దర్శకుడు ఈ చిత్రాన్ని సందేశాత్మకంగా తీర్చిదిద్దుతున్నారు. హారీష్‌జైరాజ్ స్వరపరచిన పాటల్ని త్వరలో విడుదల చేస్తాం. ఆగస్ట్ 30న సినిమాను ప్రేక్షకులముందుకు తీసుకొస్తాం. ఈ సినిమాలో ఆర్య, సాయేషాసైగల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు అని చిత్ర బృందం పేర్కొంది. బోమన్ ఇరానీ, సముద్రఖని, పూర్ణ, నాగినీడు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఎం.ఎస్.ప్రభు, సంగీతం: హారీష్ జైరాజ్, నిర్మాణ సంస్థ: లైకా ప్రొడక్షన్స్, దర్శకత్వం: కె.వి.ఆనంద్.

610

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles