విరాటపర్వం మొదలైంది


Sat,June 15, 2019 11:42 PM

rana daggubati and sai pallavi virataparvam launch

రానా, సాయిపల్లవి జంటగా నటిస్తున్న తాజా చిత్రం విరాటపర్వం శనివారం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభోత్సవం జరుపుకుంది. వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకాలపై సురేష్‌బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి సీనియర్ కథానాయకుడు వెంకటేష్ క్లాప్‌నివ్వగా, ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కెమెరా స్విచాన్ చేశారు. వచ్చే వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతాం. ఆద్యంతం భావోద్వేగభరితంగా సాగే కథాంశమిది. అన్ని వర్గాలు మెచ్చే అంశాలుంటాయి అని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: దివాకర్ మణి, సంగీతం: సురేష్ బొబ్బిలి, ఆర్ట్: నాగేంద్ర, ప్రొడక్షన్ డిజైనర్: లక్ష్మణ్ ఏలే, రచన-దర్శకత్వం: వేణు ఊడుగుల.

1584

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles