1500కోట్లతో రామాయణ్


Mon,July 8, 2019 11:48 PM

Ramayan 1500 crore adventure

డిసెంబర్‌లో చిత్రీకరణ మొదలు
ప్రముఖ నిర్మాత సంస్థ గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్, బాలీవుడ్‌లో టాప్ ప్రొడక్షన్ హౌస్ ప్రైమ్ ఫోకస్ పతాకంపై నమిత్ మల్హోత్ర సంయుక్తంగా నిర్మించబోతున్న చిత్రం రామాయణ్. 1500కోట్ల భారీ బడ్జెట్‌తో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కించబోతున్నారు. మధు మంతెన నిర్మాణ బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు. నితేష్ తివారి, రవి ఉద్యావర్ సంయుక్తంగా దర్శకత్వం బాధ్యతల్ని నిర్వర్తిస్తారు. ఈ చిత్రాన్ని మూడు భాషల్లో మూడు భాగాలుగా నిర్మించనున్నారు. ఒక్కో భాగానికి 500కోట్ల బడ్జెట్‌ను కేటాయించారు. ఈ సినిమాకు నటీనటుల్ని ఇండియా వ్యాప్తంగా వివిధ భాషా చిత్రాల నుంచి ఎంపిక చేసుకుంటారు. ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ నుంచి ప్రారంభమవుతుంది. భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నారు. ప్రపంచస్థాయి నిర్మాణ విలువలతో, అత్యున్నత గ్రాఫిక్స్ హంగులతో ఈ సినిమాకు రూపకల్పన చేస్తున్నారు. భారతదేశపు తొలి భారీ బడ్జెట్ చిత్రంగా రామాయణ్ అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తున్నది.

1864

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles