ముచ్చటగా మూడోసారి?


Sat,May 18, 2019 11:48 PM

ram to team with kishore tirumala

రామ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ఇస్మార్ట్ శంకర్. పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో వుంది. తాజాగా హీరో రామ్ మరో చిత్రాన్ని అంగీకరించినట్లు తెలిసింది. తమిళంలో అరుణ్ విజయ్ హీరోగా నటించిన చిత్రం తథమ్ అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని చూసిన రామ్ కథ, కథనం నచ్చడంతో తెలుగులో రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నారట.
kishoretirumala
యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని స్రవంతి మూవీస్ పతాకంపై స్రవంతి రవికిషోర్ తెలుగులో రీమేక్ చేయబోతున్నారు. రామ్ హీరోగా నటించనున్న ఈ చిత్రానికి కిషోర్ తిరుమల దర్శకత్వం వహించనున్నట్లు తెలిసింది. నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ వంటి చిత్రాలు రామ్, కిషోర్ తిరుమల కలయికలో వచ్చిన విషయం తెలిసిందే.

3462
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles