డబుల్ దిమాక్ ఇస్మార్ట్ శంకర్


Fri,January 4, 2019 12:30 AM

ram pothineni and puri jagannadh ismart shankar movie first look out

గత కొంతకాలంగా రేసులో వెనకబడ్డారు అగ్ర దర్శకుడు పూరి జగన్నాథ్. మంచి విజయం కోసం తపిస్తున్నారాయన. రామ్ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి ఇస్మార్ట్ శంకర్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. గురువారం రామ్ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. పోస్టర్‌లో ఓ వైపు డబుల్ దిమాక్ హైదరాబాదీ అనే క్యాప్షన్ ఇచ్చారు. పూరి మార్క్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో రామ్ పాత్ర చిత్రణ నవ్యపంథాలో వుంటుందని చెబుతున్నారు. ఫస్ట్‌లుక్‌లో రామ్ మునుపెన్నడూ లేని సరికొత్త అవతారంలో ైస్టెలిష్‌గా కనిపిస్తున్నాడని అభిమానులు అంటున్నారు. ఈ సినిమాలో వినూత్నంగా కనిపించడానికి రామ్ ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్నాడని చిత్ర బృందం చెబుతున్నది. ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ఈ నెలలోనే ఆరంభంకానుంది. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలో వెల్లడించనున్నారు. పూరీ కనెక్ట్స్, పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్ పతాకంపై పూరి జగన్నాథ్, ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

1286

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles