నెగెటివ్ పాత్రలకైనా సిద్ధమే!


Mon,March 25, 2019 03:27 AM

Ram Karthik Next Movie Director Chadalavada Srinivasa Rao

గతంతో పోలిస్తే ప్రేక్షకుల అభిరుచి మారింది. ప్రస్తుతం సహజత్వానికి దగ్గరగా వుండే చిత్రాలు, పాత్రల్నే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అలాంటి పాత్రలకే తొలి ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నాను అన్నారు యువ హీరో రామ్ కార్తీక్. ఇట్స్ మై లైఫ్ సినిమాతో కెరీర్ ప్రారంభించిన ఆయన ఇప్పటి వరకు దృశ్యకావ్యం, మంచు కురిసే వేళలో, మౌనమే ఇష్టం, వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా రామ్‌కార్తీక్ మాట్లాడుతూ మాది వైజాగ్. చిన్నతనంలోనే మా కుటుంబం హైదరాబాద్‌లో స్థిరపడింది. అనుకోకుండా ఇట్స్ మై లైఫ్ సినిమాతో హీరో అయ్యాను. ఆ తరువాత దర్శకుడు తేజ చిత్రాలకు పనిచేసిన రామానంద్‌గారి వద్ద నటనలో మెళకువలు నేర్చుకున్నాను. ఆ తరువాత నేను నటించిన సినిమాలన్నీ మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. తమిళంలో అవకాశాలు వస్తున్నాయి. ఓ ద్విభాషా చిత్రాన్ని చేయబోతున్నాను. దీనితో పాటు ఇటీవల ఓ కొత్త తరహా కథని విన్నాను. దానికి సంబంధించిన పూర్తి వివరాల్ని త్వరలో తెలియజేస్తాను. షో టైమ్‌తో పాటు మామా చందమామ చిత్రాలు విడుదలకు సిద్ధంగా వున్నాయి. చదలవాడ శ్రీనివాసరావు నిర్మిస్తున్న ఓ ద్విభాషా చిత్రంలో నటిస్తున్నాను. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్ని నిర్మాణ సంస్థే స్వయంగా ప్రకటిస్తుంది. నిర్మాణ సంస్థ, స్క్రిప్ట్, పాత్ర నచ్చితే నెగెటివ్ పాత్రలకైనా సిద్ధమే అన్నారు.

1243

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles