ప్రేమ కోసమే..


Wed,October 10, 2018 01:22 AM

Ram Hello Guru Prema Kosame Movie Audio Review

రామ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం హలో గురు ప్రేమకోసమే.. త్రినాథరావు నక్కిన దర్శకుడు. అనుపమ పరమేశ్వరన్, ప్రణీత కథానాయికలు. దిల్ రాజు సమర్పణలో శిరీష్, లక్ష్మణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నెల 18న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్ర గీతాలు మంగళవారం మార్కెట్‌లోకి విడుదలయ్యాయి. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ ఇటీవల విడుదల చేసిన టీజర్‌కు అద్భతమైన స్పందన లభించింది. ఈ టీజర్‌తో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇదొక రొమాంటిక్ లవ్‌స్టోరీ. రామ్, అనుపమపరమేశ్వరన్, ప్రణీతల కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది. మా సంస్థలో వచ్చిన ఎన్నోవిజయవంతమైన చిత్రాలకు సంగీతం అందించిన దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. పాటలు మార్కెట్‌లోకి విడుదలయ్యాయి. ఆడియోకు మంచి స్పందన లభిస్తున్నది. ఈ నెల 10న థియేట్రికల్ ట్రైలర్‌ను, అలాగే 13న వైజాగ్‌లో ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించనున్నాం. దసరా సందర్భంగా చిత్రాన్ని ఈ నెల 18న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాం అన్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: విజయ్ కె.చక్రవర్తి, ఆర్ట్: సాహి సురేష్, ఎడిటింగ్; కార్తీక శ్రీనివాస్, మాటలు: బెజవాడ ప్రసన్నకుమార్, రచనా సహకారం: సాయికృష్ణ.

4670

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles