త్రాచు పాముని చేరదీస్తే..


Tue,April 9, 2019 12:05 AM

Ram Gopal Varma Super Hilarious Speech  COBRA Movie Launch Manastars

సుదీర్ఘ కెరీర్‌లో ఇప్పటివరకు నిర్ధేశకుడిగానే తెర వెనక బాధ్యతలు నిర్వర్తించిన ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ తాజాగా నటుడిగా కొత్త అవతారంలో కనిపించబోతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో కోబ్రా పేరుతో ఓ చిత్రం రూపొందబోతున్నది. ఆర్జీవి గన్‌షాట్ ప్రొడక్షన్స్ పతాకంపై డి.పి.ఆర్ నిర్మిస్తున్నారు. రామ్‌గోపాల్‌వర్మ, అగస్త్యమంజు దర్శకత్వం వహిస్తారు. కీరవాణి స్వరకర్త. ఈ సినిమాలో రామ్‌గోపాల్‌వర్మ ఇంటిలిజెన్స్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. ఆదివారం రామ్‌గోపాల్‌వర్మ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామ్‌గోపాల్‌వర్మ మాట్లాడుతూ పుట్టినరోజు వేడుకలు చేసుకోవడం నాకు చిరాకు. ఒక సంవత్సరం చావుకు దగ్గరవుతున్నాను అనే భావన కలుగుతుంది. ఏదో ఒకటి సాధించి సెలబ్రెట్ చేసుకుంటే దానికో అర్థముంటుంది. నటుడిగా నా తొలిపుట్టిన రోజు ఇది. అందుకే జన్మదిన వేడుకల్ని జరుపుకుంటున్నాను.

ఈ సినిమా స్క్రిప్ట్ తయారుచేస్తున్న సమయంలో ఇంటిలిజెన్స్ ఆఫీసర్ పాత్రలో నేనే నటిస్తే బాగుంటుందనిపించింది. అత్యంత ప్రమాదకారి అయిన నేరస్తుడి బయోపిక్ ఇది. నా కెరీర్‌లో క్షణం క్షణం సంగీతపరంగా ఓ మైలురాయి. 29ఏళ్ల తర్వాత నేను, కీరవాణి కలిసి ఈ సినిమా కోసం పనిచేస్తున్నాం అన్నారు. కీరవాణి మాట్లాడుతూ వర్మ కెరీర్‌లో ఇది ఛాలెంజింగ్ సినిమా. స్వతహాగా ఆయన చక్కటి సంగీతప్రియుడు. స్వరకర్తగా నాలోని కొత్తకోణాన్ని ఈ చిత్రం ద్వారా రామ్‌గోపాల్‌వర్మ చూపించబోతున్నారు అని కీరవాణి చెప్పారు. నిర్మాత మాట్లాడుతూ రామ్‌గోపాల్‌వర్మతో కలిసి సంవత్సరంలో 8నుంచి పది సినిమాలు మరియు వెబ్‌సిరీస్‌లు మా బ్యానర్ మీద రూపొందిస్తాం అన్నారు. కోబ్రా చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కించబోతున్నారు. ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో శత్రువుని చంపటానికి త్రాచు పాముని చేరదీస్తే ఎప్పుడో ఒకప్పుడు మనల్ని కూడా కాటేస్తుంది అనే క్యాప్షన్ సినిమా కథాంశాన్ని ప్రతిబింబించేలా కనిపిస్తున్నది. కొద్దిరోజుల క్రితం పోలీస్‌కాల్పుల్లో మరణించిన ఓ గ్యాంగ్‌స్టర్ జీవిత కథ ఆధారంగా రామ్‌గోపాల్‌వర్మ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం.

2596

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles