దక్షిణాది తారల్నీ గుర్తించండి!

Mon,October 21, 2019 12:02 AM

భారత సినీరంగానికి చెందిన పలువురు ప్రముఖులతో ప్రధాని మోదీ శనివారం ఢిల్లీలోని తన నివాసంలో భేటీ అయ్యారు. మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకొని వినోదరంగానికి చెందిన వివిధ విభాగాలు తయారుచేసిన సాంస్కృతిక వీడియోలను మోదీ విడుదల చేశారు. అయితే ఈ వేడుకలో హిందీ సినీ, టీవీ రంగానికి చెందిన తారలు మాత్రమే కనిపించారు. ఈ విషయమై అగ్రహీరో రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన ట్విట్టర్‌ ద్వారా తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. ‘ప్రధానిగారు..దక్షిణాది తారలను కూడా గుర్తించండి’ అంటూ ఓ పోస్ట్‌ చేశారు. ‘గౌరవ ప్రధాని నరేంద్రమోదీగారికి...మీరు ప్రధాని అయినందుకు మాకు గర్వంగా ఉంది. దక్షిణ భారత ప్రజలకు కూడా మీరంటే గౌరవం. సినీ ప్రముఖులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కేవలం బాలీవుడ్‌ తారల్ని మాత్రమే ఆహ్వానించారు. సౌత్‌ ఇండియా నటీనటుల్ని విస్మరించారు. దక్షిణాది తారల్ని కూడా గుర్తించాలని కోరుకుంటున్నా. బాధతో మీకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నా. ఈ అంశాన్ని మీరు అర్థం చేసుకుంటారనే విశ్వాసం ఉంది’ అని ఉపాసన ట్విట్టర్‌లో పేర్కొంది. ప్రస్తుతం ఈ ట్వీట్‌ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

391

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles