కోనసీమలో హంగామా


Thu,May 18, 2017 11:49 PM

ramcharan
సుకుమార్ దర్శకత్వంలో రామ్‌చరణ్ కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్నది. సమంత కథానాయిక. ఏపీలోని రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో మొదటి షెడ్యూల్ పూర్తయింది. త్వరలో రెండో షెడ్యూల్‌కు సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాతలు చిత్ర విశేషాలు తెలియజేస్తూ మునుపెన్నడూ లేని విధంగా రామ్‌చరణ్‌ను సరికొత్త పంథాలో ఆవిష్కరించే చిత్రమిది. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లోని పలు అందమైన లొకేషన్లలో మొదటి షెడ్యూల్‌ని పూర్తిచేశాం. అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఈ నెల 9నుంచి రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో తలపెట్టిన రెండో షెడ్యూల్‌ను వాయిదా వేశాం. జూన్ 1 నుంచి రెండో షెడ్యూల్‌ని రాజమండ్రి, హైదరాబాద్‌లలో జరుపుతాం. గోదావరి నది ఒడ్డున భారీ సెట్ వేసి అందులో హీరో ఉపోద్ఘాత గీతాన్ని తెరకెక్కించబోతున్నాం. హైదరాబాద్‌లో కూడా కొన్ని కీలక ఘట్టాల్ని చిత్రీకరించబోతున్నాం అన్నారు. ఈ సినిమాలో రామ్‌చరణ్ అసమాన ధైర్యసాహసాలు మూర్తీభవించిన పల్లెటూరి యువకుడిగా కనిపిస్తారని సమాచారం. ఈ చిత్రంలో జగపతిబాబు, ప్రకాష్‌రాజ్, ఆది ముఖ్యపాత్రల్ని పోషిస్తున్నారు. ఈ చిత్రానికి నిర్మాతలు: యలమంచిలి రవిశంకర్, నవీన్ ఏర్నేని, మోహన్ చెరుకూరి.

666

More News

VIRAL NEWS