రియల్ మెగాస్టార్‌ను చూశాను!


Mon,September 9, 2019 03:39 AM

Ram Charan shares a candid still from Sye Raa Narasimha Reddy starring Chiranjeevi

ప్రతి ఒక్కరికి తండ్రి తొలి హీరో. మనమందరం నాన్న చేయిపట్టుకొనే ప్రపంచాన్ని చూస్తాం. తండ్రి విజయాల్ని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తాం. చిరంజీవి తనయుడు రామ్‌చరణ్ తన తండ్రిలో రియల్ మెగాస్టార్‌ను సైరా సినిమాతోనే చూస్తున్నానని సంతోషపడుతున్నారు. చిరంజీవి కథానాయకుడిగా చారిత్రక కథాంశంతో రూపొందుతున్న చిత్రం సైరా నరసింహారెడ్డి. ఈ చిత్రానికి రామ్‌చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా మేకింగ్‌కు సంబంధించిన అన్ని పనుల్ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు రామ్‌చరణ్. ఈ సందర్భంగా సైరా ఆన్‌లోకేషన్‌కు సంబంధించిన ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అభిమానులతో పంచుకున్నారు రామ్‌చరణ్.

నరసింహారెడ్డి గెటప్‌లో ఉన్న చిరంజీవికి సూచనలు ఇస్తూ రామ్‌చరణ్ కనిపిస్తున్నారు. సైరా పాత్రలో నాన్న పరకాయ ప్రవేశం చేశారు. ఆయన అభినయం మాటల్లో వర్ణించలేని గొప్ప అనుభూతిని కలిగిస్తున్నది. నేను నిర్మాతగా మారిన తర్వాతే నిజమైన మెగాస్టార్‌ను చూశాననే భావన కలిగింది అని వ్యాఖ్యానించారు రామ్‌చరణ్. ప్రస్తుతం ఈ ఫొటో మెగాభిమానుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నది. తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితగాథ ఆధారంగా సైరా చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సురేందర్‌రెడ్డి దర్శకుడు. అక్టోబర్ 2న విడుదలకానుంది.

1071

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles